ప్రభాస్, మహేష్ లపై తన అభిప్రాయం చెప్పిన శ్రద్ధ కపూర్!

  • December 21, 2017 / 10:48 AM IST

బాహుబలి తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా అనేకమంది పేర్లు పరిశీలించినప్పటికీ ఆ ఛాన్స్ శ్రద్ధ కపూర్ కి వరించింది. అప్పుడే ఆమె ట్యాలెంట్ ఏంటో అటు బాలీవుడ్, ఇటు సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమలకి తెలిసి వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెలో ఎంత ప్రతిభవుందో స్పష్టం కానుంది. ప్రభాస్ తో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన శ్రద్ధ నిన్న సోషల్ మీడియా వేదికపై అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ప్రభాస్ గురించి చెప్పమని ఫ్యాన్స్ అడగగా.. అందుకు ఆమె ” ప్రభాస్ నిజంగానే డార్లింగ్.. నేను కలిసిన మంచి వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు” అని చెప్పింది.

రజనీకాంత్ గురించి మాట్లాడుతూ “ఆయన సింప్లిసిటీ అంటే ఇష్టం. స్ఫూర్తినిచ్చే వ్యక్తి” అని పోస్ట్ చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అభిప్రాయం ఏంటి ? అని  అడగ్గా.. “ఫెంటాస్టిక్.. మైండ్ బ్లోయింగ్” అనేశారు. ఈ డైలాగ్ దూకుడులో మహేష్ బాబు చెప్పారు. అంటే మహేష్ బాబుని శ్రద్ధ ఎంతగా ఫాలో అవుతున్నారో అర్ధమవుతోంది. ఇక చివరగా అభిమానుల గురించి చెప్పాలని అడగ్గా.. “వారు లేనిదే నేను లేను.. నా అభిమానులు ది బెస్ట్‌” అంటూ ఫ్యాన్స్ ని ఫ్లాట్ చేసింది. ఆమె తొలిసారి తెలుగులో చేస్తోన్న సాహోపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus