సాహో దుబాయ్ షూటింగ్ లో జాయిన్ అయిన శ్రద్ధా.!

  • May 8, 2018 / 06:36 AM IST

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన అందం, అభినయంతో ఆకర్షించడమే కాదు.. గాల్లో విన్యాసాలతో ఆశ్చర్యపరచనుంది. హీరోతో సమానంగా యాక్షన్ సన్నివేశాల్లో ఫైట్స్ చేయనుంది. ఈ సుందరి సాహో సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ మూవీ రెండు షెడ్యూల్స్ హైదరాబాద్ లోనే జరిగాయి. ఇందులో శ్రద్ధ పాల్గొని ప్రభాస్ తో రొమాన్స్ చేసింది. తాజా షెడ్యూల్ దుబాయిలో అబుదాబి లో సాగుతోంది. గత వారం రోజులుగా ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ , కొంతమంది ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సీన్ సినిమాలో హైలెట్ గా నిలవనుంది. ఈ షూటింగ్ లో తాజాగా శ్రద్ధ కపూర్ జాయిన్ అయింది. ప్రభాస్ తో కలిసి గ్యాంగస్టర్స్ ని పట్టుకోవడానికి ఛేజ్ చేస్తోంది. దాదాపు మరో ముప్పై రోజులపాటు దుబాయ్ లోని రద్దీ ఏరియాల్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు. అనంతరం ఇండియాకి తిరిగి రానున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ టీ సిరీస్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు  సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus