ఆ ప్రొజెక్ట్ వదులుకోవడం అనేది నా ఇష్టపూర్వకంగా జరిగిన విషయమే

  • September 10, 2019 / 03:59 PM IST

హీరోలంటే పాపం ఒక సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమా చేయడానికి ఆస్కారం ఉండదు కానీ.. హీరోయిన్స్ అలా కాదు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు డేట్స్ అలాట్ చేసేస్తుంటారు. కుదిరినంతలో ఏ ఒక్క ప్రొజెక్ట్ ను వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ.. సాహో బ్యూటీ శ్రద్ధకపూర్ మాత్రం తాను సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించే అవకాశం కోల్పోవడం పట్ల ఎలాంటి బాధ లేదంట. తనకు డెంగ్యూ వచ్చి ఈ ప్రొజెక్ట్ నుంచి దూరమవ్వాల్సి వచ్చింది కానీ.. కావాలని చేసిన పని మాత్రం కాదు అని క్లారిటీ ఇచ్చింది శ్రద్ధకపూర్.

ఇకపోతే.. సాహోతోపాటు చిచోరేతో హిందీలో మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రద్ధకపూర్ కి ఇప్పటివరకు మరో తెలుగు సినిమా ఆఫర్ రాలేదంట. కొన్ని ఎంక్వైరీస్ వచ్చినప్పటికీ.. వాళ్ళందరూ శ్రద్ధకపూర్ చేప్పే భారీ రెమ్యూనరేషన్ కి భయపడి సైలెంట్ అయిపోతున్నారట. మరి అమ్మడి తదుపరి సినిమా ఏమిటనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus