తెలుగు తెరపై మాత్రమే కాదు.. అసలు వెండితెర మీద శ్రుతి హాసన్ కనిపించి దాదాపు రెండేళ్లవుతోంది. ఆమె నటించిన ఆఖరి చిత్రం “కాటమరాయుడు”. ఆ సినిమా తర్వాత ఆమె మరో తెలుగు కానీ తమిళ సినిమా కానీ అంగీకరించలేదు. ఒప్పుకున్న ఒకే ఒక్క “శభాష్ నాయుడు” కూడా ఆగిపోవడంతో అసలు ఆమె సినిమాలు అంగీకరించలేదు. తన చిన్నప్పటి ఆశయం అయిన సింగింగ్ డ్రీమ్ ను ఎచీవ్ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టింది.
అయితే.. శ్రుతిహాసన్ కథానాయికగా తెరంగేట్రం చేసి 10 ఏళ్ళు పూర్తైన సందర్భంగా నిన్న ఆమె అభిమానులందరూ సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే రచ్చ చేశారు. ఈ సందర్భంలో శృతి హాసన్ కూడా తన పదేళ్ల ప్రయాణంలో చాలా నేర్చుకున్నానని. స్టార్ డమ్ కి ఫేమ్ కి మధ్య తేడా కూడా తెలిసొచ్చిందని.. త్వరలోనే వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తానని చెప్పుకొచ్చింది శృతి. సో శృతి మళ్ళీ సినిమాల్లోకి రావడం ఖాయం అన్నమాట.