తన రిలేషన్ షిప్ పై శ్రుతి హాసన్ కామెంట్స్…

  • May 2, 2017 / 06:17 AM IST

శ్రుతి హాసన్, ఈ సెక్సీ బ్యూటీని ఐరన్ లెగ్ అంటూ అందరూ అవకాశాలు ఇవ్వకుండా పారిపోతూ ఉంటే పవన్ తో నటించిన ‘గబ్బర్ సింగ్’ ఆమెకు విపరీతం అయిన స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఆ ఒక్క దెబ్బతో సినిమా ప్రపంచంలో శ్రుతి సూపర్ హీరోయిన్ అయిపోయింది. వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దుమ్ము దులిపేస్తుంది. అయితే అదే క్రమంలో వరుస హిట్స్ తో దూసుకుపోవడమే కాకుండా, డిమ్యాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే పాపం ఏ పవన్ సినిమాతో అయితే శ్రుతి మంచి స్టార్ హీరోయిన్ గా మారిందో…అదే పవన్ సినిమా కాటమ రాయుడుతో ఆమె తన స్టార్ డమ్ కోల్పోవడం నమ్మక తప్పని నిజం అనే చెప్పాలి. ఇదిలా  ఉంటే  తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ అందాల భామ. అయితే ఈ ఇంటెర్వ్యు లో శ్రుతి కొన్ని సంచలన విషయాలకు తెరలేపింది అనే చెప్పాలి, ఆమె మాట్లాడుతూ గతంలో తన పై వచ్చిన రిలేషన్ షిప్ వార్తల పై స్పందించింది.

గతంలో తాను ఒకరిద్దరి పై మనసు పడిన విషయాన్ని దాపరికం లేకుండా అంగీకరిస్తూ వారంతా తన పనికి అడ్డం పడటం వల్ల తాను వారి చెప్పుచేతులలో ఉండటం ఇష్టం లేక తాను గతంలో రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేసిన వ్యక్తులకు దూరం అయిన విషయాన్ని అంగీకరించింది శ్రుతి. ఈమె మాటలలో కోలీవుడ్ హీరోలు సిద్దార్డ్, ధనుష్ ల పేర్లు డైరక్ట్ గా చెప్పకపోయినా ఆమె తన కామెంట్లతో టార్గెట్ చేసింది మాత్రం ఆ హీరోలనే అని అనిపించడం సహజం. అయితే ఇదే క్రమంలో శ్రుతి ఈమధ్య లండన్ కు చెందిన ఒక యువకుడి తో స్నేహం చేస్తోంది అని వార్తలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో ఈ రిలేషన్షిప్ మ్యాటర్స్ పై ఎందుకు మాట్లాడినట్లో అర్ధం కావడంలేదు. మొత్తంగా శ్రుతి హాసన్ కూడా తండ్రి కమల్ లాగానే అంతా ఓపెన్ గా మాట్లడేస్తూ విమర్శలకు గురి కావడం ఆమె అభిమానులకు రుచించని వ్యవహారం అనే చెప్పాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus