Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Advertisement

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’. తమిళంలో ‘తలైవన్ తలైవి’ గా రూపొందిన ఈ చిత్రం జూలై 25న రిలీజ్ అయ్యింది. అయితే ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా తెలుగులో రిలీజ్ అవుతుండటంతో తెలుగులో ఆ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. అయితే వారం తర్వాత అంటే ఆగస్టు 1న అదే చిత్రాన్ని ‘సార్ మేడమ్’ గా రిలీజ్ చేశారు. తమిళంలో పలు హిట్ సినిమాలు తీసిన పాండిరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. దీంతో ‘సార్ మేడమ్’ పై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి పడింది. పైగా విజయ్ సేతుపతి ‘మహారాజ’ తో ఫామ్లోకి వచ్చాడు. పైగా తమిళంలో ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది.

Sir Madam Collections

అక్కడ మంచి వసూళ్లు సాధిస్తుంది. దీంతో తెలుగులో కూడా కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కూడా. కానీ కింగ్డమ్, మహావతార్ నరసింహ వంటి సినిమాల పోటీలో ఇది ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు చేయలేకపోయింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

 

నైజాం 0.45 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర(టోటల్) 0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.92 cr(షేర్)
.
 ‘సార్ మేడమ్'(తెలుగు వెర్షన్ ఆఫ్ తలైవన్ తలైవి) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.0.92 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. గ్రాస్ పరంగా రూ.1.50 కోట్లను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.1.08 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. వీక్ డేస్ లో ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి

అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus