కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న ప్రముఖ నటుడు

  • July 12, 2018 / 07:49 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, హీరోయిన్ గా వెలుగొందిన తారలు తమ తనయులను హీరోగా పరిచయం చేయడం ఎప్పటి నుంచో వస్తోంది. తాజాగా హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా అనేక సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న శివాజీరాజా కూడా తన కొడుకుని నటుడిగా చూసుకోవాలని తపిస్తున్నారు. “మా” అధ్యక్షుడుగా బిజీగా ఉన్న శివాజీరాజా తన తనయుడు విజయ్ రాజాను హీరోగా పరిచయం చేస్తున్నారు

నూతన దర్శకుడు రమాకాంత్ రూపొందించే ఈ సినిమాకి నేడు పూజా కార్యక్రమాలు జరిగాయి. “ఏదైనా జరగొచ్చు” అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తొలి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న “బిగ్ బాస్ 2 ” షోకి సంబంధించిన ప్రోమోల ద్వారా “ఏదైనా జరగొచ్చు” అనే మాట బాగా ఫేమస్ అయింది. ఆ టైటిల్ ని సినిమాకి పెట్టి క్యూరియాసిటీ ని పెంచారు. హీరో, డైరక్టర్ కొత్తవారు చేస్తున్న సినిమాలో ఎక్కువమంది కొత్తవారు పని చేయనున్నట్లు తెలిసింది. హీరోయిన్, తదితరుల వివరాలని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. శివాజీ రాజా హాస్యాన్ని, ఎమోషన్ ని ఎంతో అద్భుతంగా పండించగలరు. మరి అతని వారసుడు ఎంత మేర ఆకట్టుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus