పవన్ సినిమా నుంచి ఎస్.జె.సూర్య ఔట్!

  • June 20, 2016 / 01:15 PM IST

“సర్దార్ గబ్బర్ సింగ్” లాంటి డిజాస్టర్ అనంతరం పవన్ కళ్యాణ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సినిమా ప్రారంభించగానే పవర్ ఫ్యాన్స్ అందరూ ఖుష్ అయిపోయారు. జూలై
నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు అనగానే సినిమా కోసం ఎదురుచూడడం మొదలెట్టేశారు. కానీ.. అనుకోకుండా సినిమాలో భారీ మార్పు చోటు చేసుకొంది.

ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఎస్.జె.సూర్య తప్పుకొన్నాడు. ప్రస్తుతం దర్శకుడిగా కంటే నటుడిగానే అందరి అభిమానాన్ని చూరగొన్న ఎస్.జె.సూర్య ఇప్పుడు డైరెక్ట్ చేయడం కంటే నటుడిగానే
కంటిన్యూ అవ్వడం మంచిది అనుకొన్నాడు. అందుకే మరో ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకొన్నాడు.

ఇప్పుడు సూర్య స్థానంలో “గోపాల గోపాల” ఫేమ్ డాలీ వచ్చి చేరాడు. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రానికి డాలీ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అనూప్ రూబెన్స్
స్వరసారధ్యం వహించనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus