సావిత్రి కూతురిగా శివి.!

Advertisement

అభినేత్రి సావిత్రి బయోపిక్ మహానటి సినిమా తెలుగువారికి మరో ఆణిముత్యంలా మారనుంది. సావిత్రి నటించిన సినిమాలు అద్భుత కళాఖండాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె జీవితంపై తెరకెక్కిన సినిమాని ఒక యజ్ఞంలా డైరక్టర్ నాగ్ అశ్విన్ పూర్తి చేశారు. స్వప్న దత్ సినిమాపై అశ్వినీదత్, స్వప్నదత్ కలిసి నిర్మించిన ఈ మూవీ రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది. ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్‌,  జెమినీ గణేషన్‌ గా దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికి ఓ ముద్దుల కూతురు ఉంది. ఆమె పేరు విజయ చాముండేశ్వరి. ఈమె చిన్ననాటి పాత్రలో తెలుగు పాప్ సింగర్  స్మిత కుమార్తె  శివి నటించింది.

ఇదివరకు స్మిత “కిలికి” సాంగ్ కి శివి కవర్ సాంగ్ చేసింది. నెటిజనులు ఆకట్టుకుంది. మహానటిలో సావిత్రి కూతురిగా అలరించనుంది. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలను స్మిత సోషల్‌మీడియాలో నేడు పోస్ట్‌ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు లైక్లు, షేర్లు అందుకుంటోంది. ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్, కెవి రెడ్డిగా క్రిష్, జర్నలిస్టులుగా సమంత, విజయ దేవరకొండ నటిస్తున్నారు. మరికొన్ని కీలకపాత్రల్లో  రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు, షాలినీ పాండే తదితరులు కనిపించనున్నారు. మిక్కి జే మేయర్‌ సంగీతమందించిన ఈ సినిమాని చూడాలని సావిత్రి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus