కరుణాకరన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది స్నేహ ఉల్లాల్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకోవడంతో ఆమె మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకుంది. చూడటానికి కొంచెం ఐశ్వర్య రాయ్ లా ఉందనే కామెంట్స్ కూడా చేశారు ప్రేక్షకులు. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. తరువాత ఈమెకు వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కింది. ‘నేను మీకు తెలుసా’ ‘కరెంట్’ ‘వరుడు’ ‘మడత కాజా’ వంటి ఫ్లాప్ సినిమాలతో పాటు ‘సింహా’ ‘అల మొదలైంది’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా ఈమె నటించింది.
అయితే కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. పలు హిందీ సినిమాల్లో నటించినా.. అవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఈమె ‘ఎక్స్ పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘ఈమెను ఐశ్వర్య రాయ్ తో పోల్చొద్దు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. “ఐశ్వర్య రాయ్ వర్క్ , ఆమె సాధించిన విజయాలు నాకు ఇన్స్పిరేషన్. కానీ ఆవిడతో నన్ను పోల్చడం నాకు అస్సలు ఇష్టముండదు.ఎందుకంటే.. నాకంటూ ఓ గుర్తింపు ఉంది. కానీ నేను ఆమెతోనే నన్ను పోలుస్తుంటారు.
అలా కంపేర్ చెయ్యొద్దు అని చాలా సార్లు చెప్పాను. అయినా ఆమెలా కనిపిస్తున్నాను అంటే.. నేనేమి చెయ్యగలను..? నా లుక్ ను నేను ఎలా మార్చుకోగలను..? నాకు నా వర్క్… నేను ఏమి సాధించాను అన్నదే చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను సాధించాల్సింది చాలా ఉంది. ఐశ్వర్య రాయ్ సాధించినంత నేను ఏమి సాధించలేదు. ఓ వేడుకలో నేను ఐశ్వర్య రాయ్ ను కలిసాను. ఆమె నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అది చాలు.. నాకు చాలా హ్యాపీగా అనిపించింది” అంటూ స్నేహ ఉల్లాల్ చెప్పుకొచ్చింది.
Most Recommended Video
కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్బాస్’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!