జూనియర్ ఐశ్వర్యారాయ్.. ఈ రేంజ్ గ్లామర్ షో అవసరమా..!

  • August 13, 2019 / 03:33 PM IST

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది స్నేహ ఉల్లాల్. ఆ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరూ జూనియర్ ఐశ్వర్య రాయ్ లా ఉందని ప్రేక్షకులు ఆమె పై ప్రశంసలు కురిపించారు. ఆ చిత్రం తర్వాత ‘నేను మీకు తెలుసా’ ‘మడత కాజా’ కరెంట్’ ‘సింహా’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో ఒక్క ‘సింహా’ తప్ప మరే చిత్రం హిట్టవ్వకపోవడంతో ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ‘అలా మొదలైంది’ చిత్రం హిట్టయినా అందులో ఆమెది కేవలం అతిధి పాత్రే కాబట్టి ఆమెకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు.

ఇక అటు తరువాత ఆమెకి పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ కూడా సినిమాలు చేసింది. అయినప్పటికీ అక్కడ కూడా ఆమె క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ అమ్మడికి ఎక్కడా పెద్ద ఆఫర్లు రావట్లేదు. ఎలాగూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి.. హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలని పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారు మతులు పోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. స్నేహ ఉల్లాల్ ఇంత ఘోరంగా అందాల ప్రదర్శన చేయడానికి కారణం సినిమాల్లో అవకాశాల కోసమే అనే సందేహం కలుగక మానదు. మరి ఈమె తపన చూసైనా దర్శకనిర్మాతలు అవకాశాలిస్తారేమో చూడాలి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus