Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Advertisement

ఈ మధ్యనే థియేటర్లలో సందడి చేసిన ‘సన్ ఆఫ్’ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ పై బత్తుల సతీష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఈ చిత్రంలో తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ‘హనుమాన్ మీడియా’ ఈ చిత్రాన్ని ఓటీటీకి తీసుకొచ్చింది. ఆల్రెడీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. మే 1 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నిర్మాణ విలువల పరంగా చూసుకుంటే.. సినిమా క్వాలిటీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. విజువల్స్ క్వాలిటీగా ఉంటాయి.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus