Sonakshi Sinha: చిరంజీవి సినిమా కోసం బొద్దుగుమ్మ గొంతమ్మ కోరికలు కోరుతోందా?

  • August 11, 2021 / 09:23 PM IST

టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నప్పుడు మన హీరోయిన్లు బాలీవుడ్‌కి వెళ్తుంటారు. అక్కడ జాగ్రత్తగా సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనుకేసుకుంటారు. ఇది మనం చాలా రోజుల నుండి చూస్తూనే ఉన్నాం. అయితే బాలీవుడ్‌ నాయికల విషయంలో ఇది రివర్స్‌. కొంతమంది నాయికలు అవకాశాలు తగ్గుతున్నప్పుడు, పెద్దగా లేనప్పుడు మన దగ్గరకు వస్తుంటారు. అయితే అలా వచ్చి గొంతెమ్మ కోరికలు కోరుతోందనేది ఇప్పుడు చర్చ.ఇటీవల కాలంలో అలా టాలీవుడ్‌లో ఓ సినిమా ఒప్పుకుంది అని టాక్‌ వినిపిస్తున్న భామ సోనాక్షీ సిన్హా.

చిరంజీవి – బాబి సినిమాలో ఆమె నాయిక అని అనుకుంటున్నారు. ఇక్కడే చిన్న పేజీ వచ్చిపడిందట. ఆమె ఇక్కడికి వచ్చి నటించడానికి చాలా కొర్రీలు పెడుతోందట. పారితోషికం నుండి సిబ్బంది జీతాల వరకు, టికెట్ల నుండి ఇక్కడ వసతి వరకూ అన్ని విషయాల్లో ఆమె లెక్కలు అంతకుమించి ఉన్నాయని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. మరి దానికి చిత్రబృందం ఏమందో తెలియాల్సి ఉంది.బాలీవుడ్‌లో సోనాక్షి సిన్హాకు సరైన విజయాలు లేవు. అంతెందుకు సరైన సినిమాలే లేవు.

కానీ ఇప్పుడు టాలీవుడ్‌ సినిమాకు ఏకంగా ₹4-₹5 కోట్లు అడుగుతోందనేది టాక్‌. దీంతోపాటు అదనంగా సిబ్బంది జీతభత్యాలు ఉన్నాయట. వసతి, టికెట్లు గురించి ముందే చెప్పాం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ వేరే ఆలోచన చేస్తోంది అంటున్నారు. గతంలో ‘లింగ’ సమయంలోనూ సోనాక్షి విషయంలో ఇలాంటి చర్చే సాగింది. మళ్లీ ఇప్పుడూ అదే పని.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus