అనుష్క-విరాట్ కోహ్లీల వివాహం అనంతరం బాలీవుడ్ లో ప్రాధాన్యత సంతరించుకొన్న మరో వివాహం సోనమ్ కపూర్ ది. తన చిన్ననాటి స్నేహితుడు ఆనంద్ ఆహూజాను మే 8న పెద్దల అనుమతితో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనుంది. ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అనిల్ కపూర్ అండ్ ఫ్యామిలీ సిద్ధమవుతున్నారు. సోనమ్ కపూర్-ఆనంద ఆహూజాల వివాహ వేడుకను రెండు రోజులపాటు నిర్వహించనున్నారట. మే 7న మెహెందీ, సంగీత్ ఈవెంట్ ను నిర్వహించి, మే 8న వివాహం మరియు రిసెప్షన్ ఈవెంట్ ను భారీగా నిర్వహించనున్నారు.
ఈ వేడుకలో బాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులతోపాటు టాలీవుడ్ సీనియర్ హీరోహీరోయిన్స్ మరియు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. సోనమ్ కపూర్ నటించిన తాజా చిత్రం “వీరే ది వెడ్డింగ్” జూన్ 1న విడుదలవుతుండగా.. ఆ చిత్రంలో అమ్మడు పెళ్లి వ్యవస్థ పట్ల నమ్మకం లేని మహిళగా నటిస్తుండడం విశేషం. మరి పెళ్లి చేసుకోబోతున్న సోనమ్ కపూర్ పెళ్ళైన తర్వాత విడుదలకానున్న తన మొదటి చిత్రంలో పెళ్లి పట్ల ఆసక్తి లేని మహిళగా తనను తాను చూసుకోనుండడం గమనార్హం.