వివాహం, విడాకులు అన్నవి సమాజంలో సర్వ సాధారణ విషయాలే. కానీ సెలబ్రిటీల విషయంలో అవి మరింత పెద్దవిగా దర్శనమిస్తాయి. ముఖ్యంగా సినీ తారల విషయంలో. అలాంటిది భారతీయ చిత్ర పరిశ్రమలోనే విశేష ఖ్యాతి ఆర్జించిన రజనీకాంత్ కుటుంబంలో ఇలాంటి వ్యవహారం చోటు చేసుకుందిప్పుడు.రజనీ రెండు కుమార్తె సౌందర్య వైవాహిక జీవితం బీటలు వారింది. 2010లో పారిశ్రామిక వేత్త అశ్విన్ రామ్ కుమార్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే కొంతకాలంగా వీరి మధ్య సఖ్యత లోపించిందట. దాంతో కలిసి కాపురం చేయాల్సిన ఈ జంట వేరువేరుగా ఉంటున్నారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా జారి వార్తలకు కొత్త వెలుగునిచ్చింది. అయితే వెంటనే దీనిపై స్పందించిన సౌందర్య “ఆ వార్తల్లో వాస్తవం లేకపోలేదని అయితే ఈ విషయంలో తమకు ప్రైవసీ కల్పించాలని, తమ కుటుంబాన్ని గౌరవించాలని” కోరారు. తమిళ నాట అమలాపాల్ -విజయ్ విడాకుల మేటర్ చివరి పేజీకి చేరుకొనేలోపే ఇలాంటి వార్త రావడం గమనార్హం.
News about my marriage is true. We have been separated for over a year & divorce talks are on. I request all to respect my family’s privacy.
— soundarya rajnikanth (@soundaryaarajni) September 16, 2016