రజినీకాంత్ రెండో కూతురుకి… రెండో పెళ్ళి…!

  • January 23, 2019 / 10:56 AM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన కూతురు సౌందర్య తన భర్త అశ్విన్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో ఏడేళ్ళ తమ వివాహ జీవితానికి గుడ్ బై చెప్పేశారు. తాజాగా సౌందర్య రెండో పెళ్లికి సిద్ధమైంది. వ్యాపారవేత్త విషాగన్ వనంగముడి తో ఈమెకు నిశ్చితార్ధం కూడా జరిగింది. ఇక వీరిద్దరి పెళ్ళికి డేట్ కూడా ఫిక్స్ చేశారు కుటుంబసభ్యులు. బందుమిత్రుల మధ్య ఫిబ్రవరి 11న వీరి వివాహం జరగబోతుంది. రజినీకాంత్ ఇంట్లోనే ఈ వేడుకను నిర్వహించబోతున్నారు.

ఇక ఈ పెళ్లి వేడుకను చాలా సింపుల్ గా జరపాలని రజినీకాంత్ భావిస్తున్నారట. ఇందుకోసం పెళ్ళి శుభలేఖలను కూడా ప్రింట్ వేయించడంలేదని తెలుస్తుంది. పెళ్ళికి ఒకరోజు ముందు ఫిబ్రవరి 10న గెట్ టు గథెర్ ఏర్పాటు చేయబోతున్నారట. ప్రముఖ వ్యాపారవేత్త అయిన వనంగముడి కొడుకే విషాగన్. విషాగన్ కి సొంతంగా ఫార్మసిటకల్ కంపనీ కూడా ఉంది. ఇక సౌందర్య విషయానికొస్తే ‘కొచ్చాడియాన్’ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి… తన బావ ధనుష్ తో కూడా ‘విఐపి2’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus