‘టీజర్’తో మహేష్ మ్యాజిక్!

  • August 31, 2016 / 08:30 AM IST

సినిమా మ్యాటర్ తెలియాలి అంటే…సినిమా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలి అంటే…అసలు సినిమాపై అంచనాలు పెరగాలి అంటే మనకు ఉపయోగపడేది సినిమా టీజర్, ట్రైలర్. అయితే ఒక్కోసారి సినిమా తొలి టీజర్ వరకూ లేని బజ్ సడన్ గా టీజర్ తర్వాత వచ్చేస్తుంది..బిజినెస్ పీక్స్ కి వెళ్ళిపోతుంది. సినిమాపై అంచనాలౌ పెంచేస్తుంది….ఉదాహరణకి తలైవార్ ‘కబాలి’ సినిమానే తీసుకోండి, ఈ టైటిల్ బయటకు వచ్చినప్పుడు పెద్దగా సినిమాపై బజ్ లేదు, కానీ సినిమా తొలి టీజర్ విడుదలయ్యింది

ఇక అక్కడ నుంచి మొదలయ్యాయి ప్రకంపనలు…అలా ఈ సినిమా అనే కాదు, చాలా సినిమాల రూపు రేఖలు ఒక్క టీజర్, ట్రైలర్ తో మారిపోతున్న క్రమంలో దర్శకులు అలాంటి విషయాలపై చాలా శ్రద్ద పెడుతున్నారు…విషయంలోకి వెళితే…మురుగుదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇప్పటికీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని, వచ్చే వారం నుంచి రెండో షెడ్యూల్ లోకి అడుగుపెట్టనుంది. ఇక అదే క్రమంలో ఈ సినిమా ఫర్స్ట్ లుక్ మరియు, టీజర్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు మురుగుదాస్…టీజర్ కోసం ఏకంగా స్పెషల్ షూట్ ఒకటి ప్లాన్ చేశాడట. ఒకట్రెండు రోజులు కేవలం ఈ టీజర్ కోసమే షూటింగ్ జరుగుతుందట. అభిమానులకు కిక్కిచ్చేలా.. సినిమా మీద అంచనాలు పెంచేలా ఈ టీజర్ ప్లాన్ చేస్తున్నాడట మన దర్శకుడు. ఇక వచ్చే అక్టోబర్ నెలలో టీజర్ ను అభిమానుల ముందుకు వదులుతాడు అని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు….రకుల్ ప్రీత్ సింగ్ మన ప్రిన్స్ తో రొమ్యాన్స్ చెయ్యనుంది. చూడాలి ప్రిన్స్ టీజర్ తో ఎటువంటి మ్యాజిక్ చెయ్యబోతున్నాడో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus