స్పైడర్ టైటిల్ సాంగ్ కాపీ అంట…

  • August 3, 2017 / 01:40 PM IST

ఈమధ్య మ్యూజిక్ డైరెక్టర్లు చాలా కష్టపడి తయారుచేసిన ట్యూన్స్ “కాపీ” అంటూ సదరు పాట విడుదలైన గంటలోపే ఆ పాట ఎక్కడ్నుంచి కాపీ కొట్టారు, సదరు ట్యూన్ ఏ ఆల్బమ్ లోది అనే విషయాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా.. మహేష్ బాబు మోస్ట్ హైప్డ్ మూవీ “స్పైడర్”లో టైటిల్ సాంగ్ “బూమ్ బూమ్” నిన్న విడుదలైంది. పాట విడుదలైన గంటలోపే ఈ పాట ఎక్కడి కాపీ కొట్టారో కనిపెట్టేశారు నెటిజన్లు.

“ఫిఫ్త్ హార్మనీ” అనే ఇంగ్లీష్ ఆల్బమ్ నుంచి బేసిక్ థీమ్ ను కాపీ కొట్టిన హరీష్ జైరాజ్, మధ్యలో తన మునుపటి చిత్రమైన “ఎంతవాడు గానీ”లోని “మన్మధ..” అనే పాటలోని ట్యూన్ ను కూడా మిక్స్ చేశాడు. దాంతో మహేష్ బాబు వీరాభిమానులు కూడా మరీ ఈరేంజ్ కాపీయా అంటూ విస్తుబోయారు. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హరీష్ జైరాజ్ తదుపరి విడుదలయ్యే పాటల విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకొంటాడో లేదో!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus