స్పైడర్ సెంటిమెంటల్ గా మారిందా??

  • July 31, 2017 / 12:12 PM IST

టాలీవుడ్ యువ హీరోల్లో ప్రిన్స్ మహేష్ బాబుది ప్రత్యేక శైలి…అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రిన్స్ కి అనుకోకుండా బ్రహ్మోత్సవం సినిమా భారీ డిజస్టార్ గా నిలవడంతో కాస్త ఆలోచించి ఎలా అయినా హిట్ అందుకోవాలి అన్న కసితో ఉన్నాడు మన ప్రిన్స్…అదే క్రమంలో ఆ హిట్ కోసం సూపర్ కధను అదీ సైంటిఫిక్ కధను ఎందుకుని మరీ మన ముందుకు రానున్నాడు…ఇదిలా ఉంటే …ప్రిన్స్ మళ్లీ తన స్టామినా ను చూపించే క్రమంలో….ఈ సినిమా ఘన విజయం సాధించడానికి సరికొత్తగా బుధవారం సెంటిమెంట్ ను తెరపైకి తీసుకువచ్చారు. అసలు మ్యాటర్ ఏంటి అంటే…‘బాహుబలి 2’ తర్వాత మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల కానున్న భారీ తెలుగు సినిమా  కావడంతో ఈ మూవి ఏమేరకు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది అన్న విషయమై రకరకాల అంచనాలు ఉన్నాయి. ‘బాహుబలి 2’ విజయంలో ప్రమోషన్స్  కీలకపాత్ర పోషించిన నేపధ్యంలో ‘స్పైడర్’ ను కూడ భారీ స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈ మూవీ విడుదల అవుతున్న సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం కావడంతో  ఇకనుంచి  ప్రతి బుధవారం వారానికొకటి చొప్పున సినిమాకు సంబంధించిన ఏదొక అప్ డేట్ ప్రేక్షకులను పలకరించేలా దర్శకుడు మురగదాస్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గత బుధవారంనాడు రెండు పోస్టర్స్ తో ప్రారంభమైన ఈ ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా విడుదల వరకు కొనసాగనున్నాయి. రాబోతున్న బుధవారంనాడు అంటే ఆగష్టు 2వ తేదీన “స్పైడర్”కు సంబంధించిన మొదటి పాట విడుదల కానుంది. అదేవిధంగా ఈసినిమా టీజర్ ను కూడ ఆగష్టు 9 బుధవారం రోజున  మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  మొత్తంగా చూసుకుంటే ఎలా అయినా సినిమా హిట్ కావాలి అన్న ఆలోచనతో ప్రతీ దాన్ని సెంటిమెంట్ తో ముడి పెట్టి మరీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాడు ప్రిన్స్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus