స్టార్ డైరక్టర్ తేజ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీ గురించి రోజుకో న్యూస్ బయటికి వచ్చి ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహానటుడుగా బాలకృష్ణ నటిస్తున్న ఈ మూవీ రామకృష్ణ సినీ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే నిమ్మకూరుకి చిత్ర బృందం వెళ్లనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనుంది. ఎన్బీకే ఫిలింస్ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా స్టార్స్ తో నిండిపోతోంది. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను విద్య బాలన్ పోషించనున్నట్టు తెలిసింది.
శ్రీదేవి గా దీపికా పదుకునే కనిపించనుంది. ఇందిరాగాంధీ రోల్ ని నదియా పోషిస్తున్నారు. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్ కనిపించనున్నారు. ఇప్పటికే భారీ తారాగణం ఉంటే.. ఇందులో తాజాగా రానా నటించనున్నట్లు తెలిసింది. అదికూడా ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రలో కనిపించనున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. తేజ తో రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశారు. ఆ స్నేహంతో తేజ అడిగిన వెంటనే రానా అంగీకరించారని సమాచారం. ఈ కాస్టింగ్ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేయనున్నారు.