సాధారణంగా సినిమా ఆఫర్లు అందిపుచ్చుకోవడం కోసం యూట్యూబ్ లేదా బుల్లితెరను వినియోగించుకోంటుంటారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ తెరల మీద కథానాయికలుగా హల్ చల్ చేస్తున్న చాలామంది ఇలా బుల్లితెరల ద్వారా పరిచయమైనవారే. అలాగే.. బుల్లితెర సెన్సేషన్ శ్రీముఖి కూడా ఈటీవీలో యాంకర్ గా తన కెరీర్ ను ఆరంభించింది. “జులాయి” చిత్రంలో అల్లు అర్జున్ చెల్లులుగా ముఖ్యపాత్ర పోషించి మంచి పేరు సంపాదించుకొన్న శ్రీముఖి తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే.. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడం పక్కనపెడితే.. కనీసం విడుదలైనట్లు కూడా సగం మంది సినిమా జనాలకి తెలియకపోవడం గమనార్హం.
అయితే.. “పటాస్” షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకొన్న శ్రీముఖిని పెట్టి “గుంటూరు టాకీస్” తరహా సినిమాలు చేయాలని కొందరు దర్శకనిర్మాతలు ప్రయత్నించారట. ఇంకొందరు శ్రీముఖిని మెయిన్ హీరోయిన్ గా పెట్టి చిన్న సినిమాలు తీయాలని కూడా ట్రై చేశారట. అయితే.. తనకు బుల్లితెరపై వస్తున్నంత ఆదరణ బుల్లితెరపై రాకపోతుండడంతో హర్ట్ అయ్యి.. సినిమాల్లో కంటే ఇలా రియాలిటీ షోలు, కామెడీ షోలు చేసుకుంటూ ముందుకెళ్లడం ఉత్తమం అని భావించి తన వద్దకు వస్తున్న ఆఫర్లాన్నిట్నీ వదులుకుంటూ .. హ్యాపీగా షోలు చేసుకుంటూ దూసుకుపోతుంది.