ఈసారి సినిమాలో శ్రీనువైట్ల సెటైర్ ఎవరి పైనో తెలుసా?

Advertisement

డైరెక్టర్ శ్రీనువైట్ల తీసిన ప్రతి సినిమా లో కూడా కామెడీకి పెద్ద పీట వేస్తాడు. అయన ప్రతి సినిమాలో కూడా ఏదో సెటైరిక్ గా కామెడీ అనేది తప్పకుండ ఉంటుంది. కొన్ని సినిమాలో అయితే ఇండైరెక్ట్ గా ఎవరిమీదో ఈ సెటైర్ వేసాడనే రూమర్లు కూడా కొన్ని వచ్చాయి. ఇది ఇలా ఉంటె కామెడీ విషయంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమా `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`. ఈ సినిమా రిలీజ్ కి దగ్గరలో ఉంది. అయితే ఈ సినిమాలో కూడా శ్రీనువైట్ల అదిరిపోయే సెటైరిక‌ల్ ఎపిసోడ్‌ని ఒకటి రాసారంటా.

ఇక విషయంలోకి వెళితే, అమెరికా లో తానా, నాటా రెండు తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఈసారి శ్రీనువైట్ల ద్రుష్టి వీరిమీద పడింది. వాటా అనే పేరుతో ఒక 5 నిముషాలు అదిరిపోయే కామెడీ ట్రాక్ ని పెట్టారంటా. ఇందులో వచ్చే సీన్లలో సునీల్, వెన్నెల కిషోర్, రగుబాబు, జయప్రకాశ్ రెడ్డి, సత్య ఇలా కామెడీ గ్యాంగ్ అంత కూడా అందరి కడుబూబ్బా నవ్విస్తారట. అయితే ఇది కామెడీ సినిమా కాకపోవడంతో సినిమాలో తన కామెడీ మార్క్ కనిపించేలా ఈ ఎపిసోడ్ ని హైలైట్ గా తీశారంటా. మరి శ్రీనువైట్ల, రవితేజ సూపర్ హిట్ కాంబినేషన్ లో చాలా గ్యాప్ తరువాత వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే 16 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news