మీటూ అంటూ శ్రీరెడ్డి చేసిన హడావుడికి, ముఖ్యంగా ఫిలిమ్ ఛాంబర్ ముందు చేసిన అర్ధ నగ్న ప్రదర్శనకి ఆమెను టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మూకుమ్మడిగా బ్యాన్ చేసింది. దాంతో చెన్నై వెళ్ళిపోయిన శ్రీరెడ్డి అక్కడ సెటిల్ అవ్వడానికి ప్విశ్వప్రయత్నం చేసింది కానీ.. ఏదీ పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించలేదు. అటు ఇటు తిరిగి మళ్ళీ గూటికి చేరినట్లు.. అన్నీ ఇండస్ట్రీలను కెలికేసిన శ్రీరెడ్డి లాస్ట్ కి టాలీవుడ్ కే రిటర్న్ అయ్యింది.
“డ్రీమ్” ఫేమ్ భవానీ శంకర్ త్వరలో రాజేంప్రసాద్ & పృధ్వీ ప్రధాన పాత్రల్లో “క్లైమాక్స్” అనే సినిమా తెరకెక్కించనున్నాడు. ఆ సినిమా కథ ఓ హత్య చేయబడిన కథానాయిక జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆ కాంట్రవర్సీయల్ హీరోయిన్ గా శ్రీరెడ్డి కనిపించనుంది. ఇక్కడ రాజేంద్రప్రసాద్ & పృధ్వీలు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కావడం విశేషం. మరి రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని శ్రీరెడ్డి ఏమేరకు వినియోగించుకోంటుందో చూడాలి.
మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!