పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

  • September 29, 2018 / 03:17 AM IST

నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అమ్మని తిట్టి పెద్ద వివాదానికి కేంద్ర బిందువయింది. ఆ వివాదం సద్దుమణిగిందని అనుకునేలోపే మరోసారి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..  పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…  “ఎవరు ఎవరితోనే పడుకుంటే దాని మీద నేనేం స్పందించాలి. పవన్ కల్యాణ్‌కి సంబంధం లేని విషయాల మీద ఆరు నెలలు, సంవత్సరం పాటు టీవీ ప్రోగ్రామ్‌లు చేస్తారు. రౌడీల మీద, గుండాల మీద చేయొచ్చుగా. వాళ్లు చేసిన దుర్మార్గాలను చూపించొచ్చుగా… భయం. పవన్ కల్యాణ్ ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఓ ఆడేసుకుందాం” అంటూ తనని విమర్శించే వారికి పవన్ చురకలు అంటించారు.

ఈ వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ లైవ్ ద్వారా శ్రీరెడ్డి స్పందించింది. “క్యాస్టింగ్ కౌచ్ లాంటి పెద్ద సమస్యను నెత్తినెక్కుకుని పోరాడుతుంటే… పవన్ కల్యాణ్ ఇలా అవమానిస్తున్నాడు. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు. అమ్మాయిలు సమస్యలు చెప్పుకుంటుంటే వినడానికి మీరు టైం లేదు. ‘వీరనారీ విభాగం’ అని ఎందుకు పెట్టారు.  అమ్మాయిలకు వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు మీకు టైం లేదు. వాళ్ల సమస్యలను చెప్పుకుంటే మీరు వినరు. ఓ పబ్లిక్ స్టేజీ మీద ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలీదు. జనాల మధ్య అలాంటి వ్యాఖ్యలు చేస్తారా?” అంటూ విరుచుకు పడింది. ఇంకా మాట్లాడుతూ “అక్రమ సంబంధాలను లీగలైజ్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల, పవన్ కల్యాణ్‌కు ఎంతో మేలు జరిగింది. ఆయనకీ, ఆయనతో సంబంధం పెట్టుకున్న వాళ్లకి ఇక స్వేచ్ఛ వచ్చినట్టే” అంటూ శ్రీరెడ్డి వ్యగ్యంగా మాట్లాడింది. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే పవన్ కల్యాణ్‌కి పోటీగా ఎలక్షన్లలో నిలబడతానని చెప్పింది. ఇంతకీ ఏ పార్టీ ఆమెకు సీటు ఇస్తుందో.. అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus