వీడియో ఇంటర్వ్యూల్లో చాడీలు చెప్పడం మొదలెట్టేసింది

ఆల్రెడీ ఒకసారి మెగా ఫ్యామిలీని కెలికి మరీ పరువు పోగొట్టుకున్న శ్రీరెడ్డికి ఇంకా బుద్ధి రాలేదో లేక ఇదివరకటిలానే మళ్ళీ ఆమె వెనుక ఎవరైనా ఉండి ఈ వెధవ నాటకాలు ఆడిస్తున్నారో తెలియదు కానీ.. మళ్ళీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ లు, వీడియోలు పెడుతోంది శ్రీరెడ్డి. మరి కావాలనే కెలుకుతోందా లేక ఈమధ్య తనను ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టి ఇలా హడావుడి చేస్తే మళ్ళీ జనాల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందా అనేది తెలియదు కానీ.. జనాలు మాత్రం ఆమె వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకొనే పనిలో లేరు.

ఇకపోతే.. త్వరలోనే “క్లైమాక్స్” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి పలకరించనున్న శ్రీరెడ్డి మళ్ళీ లైవ్ వీడియోలు చేయడం మొదలెట్టింది. మొన్నటికి మొన్న మెగాస్టార్ ను ఉద్దేశించి ఒక వీడియో చేసిన శ్రీరెడ్డి.. తాజాగా ఇస్తున్న వీడియో ఇంటర్వ్యూల్లో మనిషి పేరు చెప్పకుండా తనను ఆ హీరో/దర్శకుడు వాడుకొన్నాడని, శారీరికంగా చాలా వేధించాడని చెప్పుకొచ్చింది. ఇలా ఎవరో ఒకరి మీద బురదచల్లితే తప్ప శ్రీరెడ్డికి టైమ్ పాస్ అవ్వదేమో.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus