2020లో జరిగిన ఏకైక మంచి పని ఇదే

2018లో మొదలైన తుఫాను 2019 వరకు సాగింది. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందా? తమ పర్సనల్ చాట్ స్క్రీన్ షాట్స్ ఎక్కడ సోషల్ మీడియాలో దర్శనమిస్తాయా అని ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో పేరున్న నటులు, దర్శకులు, నిర్మాతలు, మేనేజర్లు, ఆఖరికి మీడియా ప్రతినిధులు కూడా భయపడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. దీనంతటికి ఏకైక కారణం శ్రీరెడ్డి. ఫిలిం చాంబర్ లో అర్ధ నగ్న ప్రదర్శన చేసింది మొదలు.. మీడియాలో పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టడం, నానిపై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం, కొరటాల శివ, లారెన్స్ వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.

ఏంట్రా బాబు ఈ రచ్చ అని అందరూ నెత్తిన చేతులేసుకున్నారు. తెలుగునాట హల్ చల్ చేసింది సరిపోదు అన్నట్లు తమిళంలోనూ రచ్చ చేసింది శ్రీరెడ్డి. అక్కడి స్టార్ హీరోల మీద కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసి అక్కడ మీడియాలోనూ హైలైట్ అయ్యింది. ఇంత హడావుడి చేసిన శ్రీరెడ్డి ఉన్నట్లుండి సైలెంట్ అయిపొయింది. ఆమె ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ లో వంటలు చేసుకుంటూ, అప్పుడప్పుడు ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో నోటికొచ్చిన కామెంట్స్ చేస్తూ టైంపాస్ చేస్తోంది. ఇదివరకటిలా మీడియా కూడా ఆమె కామెంట్స్ ను హైలెట్ చేయడం లేదు.

దీనంతటికి కారణం లాక్ డౌన్. ఈ సమయంలో ఆమెను ఏ మీడియా హౌజ్ పట్టించుకోలేదు, ఏ ఇండస్ట్రీ మనిషీ కేర్ చేయలేదు. దాంతో శ్రీరెడ్డి అనే పేరు, ఆమె చేసిన హడావుడి గతంలో కలిసిపోయాయి. దాంతో.. 2020లో ఇండస్ట్రీకి జరిగిన మంచిగా ఈ పరిణామాన్ని పేర్కొంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఆమె ఇలానే సైలెంట్ గా ఉంటుందా? లేక మళ్ళీ విజృంభిస్తుందా? అనేది చూడాలి.

Most Recommended Video

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus