తన అందంతోనే కాక అభినయంతోనూ 80 మరియు 90వ దశాబ్ధంలో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించడంతోపాటు వేల మంది అభిమానుల్ని సంపాదించుకొన్న అతిలోకసుందరి శ్రీదేవి.. అనంతరం బాలీవుడ్ కి పయనమై ఆ తర్వాత బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణీకపూర్ ను లవ్ మ్యారేజ్ చేసుకొని సినిమాకి స్వస్తి పలికింది. ఆ తర్వాత కొన్నేళ్ళ విరామం తీసుకొని “ఇంగ్లీష్ వింగ్లీష్”తో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికి నటిగా మంచి స్పందన లభించినప్పటికీ.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయి కలెక్షన్స్ ను సైతం రాబట్టలేకపోయింది.
ఆ తర్వాత రీసెంట్ గా నటించిన “మామ్” కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయంపాలైంది. ఇక తమిళనాట శ్రీదేవి నటించిన “పులి” ఆమెకు నటిగానూ చెడ్డ పేరు తీసుకురావడం గమనార్హం.
దాంతో శ్రీదేవి మళ్ళీ తన రీఎంట్రీ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించిన గౌరీ షిండే దర్శకత్వంలో మరో సినిమా చేసి నటిగా తన స్టామినా ప్రెజంట్ జనరేషన్ కు చూపాలని ఫిక్స్ అయ్యింది. తన భర్త బ్యానర్ లో రూపొందే సినిమాలో శ్రీదేవి ముఖ్యపాత్ర పోషించనుందని తెలుస్తోంది. పెళ్లాయ్యాక పిల్లలు తమ తల్లిదండ్రులను సరిగా పట్టించుకోకపోవడం వల్ల సదరు తల్లిదండ్రులు పడే బాధను కథాంశంగా ఎంకుకొంది గౌరీ షిండే. కొడుకు ప్రేమను పొందలేక బాధపడే తల్లిగా శ్రీదేవి కనిపించనుంది.