“మహేష్”నే కాదన్న బ్యూటీ కూతురు!!!

  • August 1, 2016 / 07:22 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు సరసన సినిమా చాన్స్ వస్తే కాదు అనే వాళ్ళు ఉంటారా…ఉండనే ఉండరు కదా….అవును ప్రిన్స్ పక్కన అవకాశం అంటే మాటలా మరి, ఎవరికో గాని రాదు ఆ అవకాశం. అయితే అలాంటి అవకాశాన్ని ఇట్టే కొట్టి పడేసింది బ్యూటీ క్వీన్ శ్రీదేవి. అదేంటి శ్రీదేవి మళ్ళీ హీరోయిన్ గా నటిస్తుందా అన్న డౌట్ రావచ్చు, కంగారు పడకండి ఈ అవకాశం శ్రీదేవి కూతురు జాహ్ణవికి.

విషయం ఏమిటంటే…అందాల భామ శ్రీదేవి కూతురు…జాహ్న‌విని ప‌రిచ‌యం చేయాల‌ని ఎందరో ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. కానీ. .ఒక్క‌రికి కూడా ఆ ఛాన్స్ ద‌క్క‌లేదు. ముందు చ‌దువు.. ఆత‌ర్వాతే యాక్టింగ్ అంటూ.. శ్రీ‌దేవి వాయిదా వేస్తూ వ‌చ్చింది. చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత జాహ్న‌వి సాకులు చెబుతూ త‌ప్పించుకుంటోంది. ఇక ఇప్పుడు తమిళ దర్శకుడు మురుగుదాస్ సైతం ఆమెను మహేష్ సినిమాలో నటింపజేసెందుకు సర్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అదే విషయమై శ్రీదేవిని సంప్రదిస్తే…ప్ర‌స్తుతానికి న‌టించ‌డానికి సిద్దంగా లేదని.. పూర్తిగా జాహ్న‌వి ఫిట్ కావ‌డానికి టైం ప‌డుతుంద‌ని  చెప్పింద‌ట‌.

డ్యాన్స్ నేర్చుకోవాల‌ని.. అందుకోసం.. లాస్ ఏంజెల్స్‌లోని ఓ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చామని.. యాక్టింగ్‌.. డ్యాన్స్‌.. ఇలా అన్నీ నేర్చుకున్న త‌ర్వాతే.. సినిమాల్లో నటించ‌డం మొదలు పెడుతుంది అని చెప్పింద‌ట‌. ఇలా జాహ్ణవి ప్రిన్స్ కి నో చెప్పడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారంట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus