దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అందరికీ సుపరిచితమే. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా మారిన ఇతను.. ఆ తర్వాత వెంకటేష్ – మహేష్ లను హీరోలుగా పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. మల్టీస్టారర్ చిత్రాలకి ప్రాణం పోసిన సినిమా ఇది అని చెప్పుకోవచ్చు. 2013 లో వచ్చిన ఈ చిత్రాన్ని చూసి అప్పట్లో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.. కానీ ఇప్పుడైతే ఇది ఒక క్లాసిక్ అని పొగిడే బ్యాచ్ చాలా మందే ఉన్నారు.
అయితే అటు తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేసిన ‘ముకుంద’ ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. అయినప్పటికీ మహేష్ బాబు పిలిచి ‘బ్రహ్మోత్సవం’ చేసే ఛాన్స్ ఇచ్చాడు. స్క్రిప్ట్ లేకపోయినా ఆ సినిమాని ఓకే చేశాడు మహేష్. అయితే ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఆ ఏడాదికి ‘బ్రహ్మోత్సవం’ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాపై భారీగా ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ సినిమా వల్ల దాదాపు 4 ఏళ్ళ పాటు సినీ పరిశ్రమకి దూరమయ్యాడు శ్రీకాంత్ అడ్డాల.
ఇక ‘బ్రహ్మోత్సవం’ (Brahmotsavam) ప్లాప్ పై ఇటీవల శ్రీకాంత్ అడ్డాల స్పందించాడు. ఈ సినిమా ఫలితం వల్ల మహేష్ కి శ్రీకాంత్ కి ఏమైనా గ్యాప్స్ వచ్చాయా అనే ప్రశ్నకి .. మహేష్ ఊహించని సమాధానం ఇచ్చాడట. ‘ఇప్పుడు ఇద్దరం బాగానే ఉన్నాం కదా అండి. మధ్యలో అలాంటివి వస్తాయి. మీరు దాన్ని మర్చిపోండి’ అంటూ మహేష్.. శ్రీకాంత్ కి చెప్పాడట.