తెలుగు సినీ పరిశ్రమలో తండ్రి కొడుకులు ఒకే సినిమాలో కలిసి నటించే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. తెరపైన వివిధ పాత్రల్లో తలపడిన సందర్భాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున కలిసి నటించారు. అలాగే మంచు మోహన్ బాబు తనయులు మనోజ్, విష్ణులతో కలిసి అనేక సినిమాలు చేశారు. చిరంజీవి తన కొడుకు చెర్రీ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరో హీరో తన అబ్బాయితో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అతనే కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్. హీరోగా అనేక హిట్లు కొట్టిన ఇతను ఇప్పుడు క్యారక్టర్ రోల్స్ తో ఆకట్టుకుంటున్నారు.
శ్రీకాంత్ తనయుడు రోషన్ గత ఏడాది నిర్మల కాన్వెంట్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా విజయం సాధించక పోయినప్పటికీ రోషన్ నటనతో ఆకట్టుకున్నారు. విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. రోషన్ ఈ సారి తండ్రితో కలిసి రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వాసుల సమాచారం. కథ, డైరక్టర్ అంత ఫిక్స్ అయిపోయిందని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.