ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన శ్రీ ముఖి

  • March 24, 2017 / 01:57 PM IST

హీరోయిన్లతో సమానంగా నేటి యాంకర్లు అందాలతో మత్తెక్కిస్తున్నారు. అడల్ట్ కామెడీ షోలతో బాగా పాపులర్ అయిన రష్మీ గుంటూరు టాకీస్ లో స్కిన్ షోతో ఆకట్టుకోగా, అనసూయ విన్నర్ లో ఐటెం సాంగ్ లో అదరగొట్టింది. ఇక సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరుస్తున్న శ్రీ ముఖి అడల్ట్ మూవీ “బాబు బాగా బిజీ” లో నటిస్తోంది.  నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ హాట్ సీన్లతో నిండి సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామనే ఆత్రుతని పెంచింది. ఇందులో హీరో అవసరాల శ్రీనివాస్, శ్రీముఖిని ముగ్గులోకి దించుతున్నట్లుగా, వాళ్లిద్దరి మధ్య రొమాన్స్ సీన్లు ఉన్నట్లుగా అనిపించడంతో శ్రీముఖి అందాల ఆరబోత ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు.

కానీ వారి ఆశలపై శ్రీముఖి నీళ్లు చల్లేసింది. ” ‘బాబు బాగా బిజీ’లో నేను హాట్ సీన్లు చేసినట్లు జరుగుతున్న ప్రచారం అబద్దం. అందులో నేను  చేసింది గౌరవప్రదమైన పాత్ర” అని శ్రీముఖి స్పష్టం చేసింది.  ఆమె మాటల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus