సెక్స్ ఎడిక్ట్ గా శ్రీనివాస్ అవసరాల!

Advertisement

2015లో బాలీవుడ్ లో రూపొంది సంచలన విజయం సాధించిన “హంటర్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిన్నప్పట్నుంచే సెక్స్ పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండడంతోపాటు.. పెద్దయ్యాక వయసుతో సంబంధం లేకుండా అవకాశం వచ్చినప్పుడల్లా.. ఎవరితోనైనా సెక్స్ లో పాల్గొనే ఓ యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా ఓ చిన్నసైజు సంచలనానికి తెరలేపిండి.

ఈ చిత్రాన్ని తెలుగులో యాక్టర్ టర్నడ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో రీమేక్ చేసేందుకు నవీన్ మేడారం అనే యువ ప్రతిభాశాలి రంగం సిద్ధం చేసుకొంటున్నాడని సమాచారం.

మితిమీరిన శృంగార సన్నివేశాలు లెక్కకు మిక్కిలిగా ఉండే “హంటర్” సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకూ నచ్చుతుందో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus