సినిమా తీయడం మొదలుకొని విడుదల వరకూ చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. సినిమాకి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు తప్ప మరో కంటెంట్ బయటకి రానివ్వరు. సినిమా ఔట్ పుట్ మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప సినిమాని కనీసం ఒక్కరోజు ముందు చూపించడానికి కూడా ఇష్టపడరు. కానీ.. దిల్ రాజు మాత్రం తన తాజా చిత్రమైన “శ్రీనివాస కళ్యాణం”ను మాత్రం ఏకంగా ఒకవారం ముందే తన సినిమా యూనిట్ కు, తన సన్నిహితులకు చూపించారు. యూనిట్ మెంబర్స్ అందరూ సినిమా చూసి తాము వర్క్ చేసిన మూవీ అవుట్ పుట్ ఇంత అద్భుతంగా వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయగా.. రాశీఖన్నా అయితే ఏకంగా డైరెక్టర్ కాళ్ళకి దండం పెట్టేసిందట.
అందుకే.. సినిమాను శుక్రవారం కాకుండా ఒకరోజు ముందుగా అంటే.. గురువారమే విడుదల చేయనున్నారు. బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్స్ మొదలవ్వనున్నాయి. దాంతో దిల్ రాజు ఆల్రెడీ “మా సినిమా సూపర్ హిట్” అని ప్రమోట్ చేసేస్తున్నారు. మరి వీళ్ళ నమ్మకం నిలబడుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.