శ్రీనువైట్ల మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు!

  • July 11, 2016 / 12:22 PM IST

ముకుంద సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మెగాహీరో వరుణ్ తేజ్. మొదటి నుండి తన సినిమాలు ప్రత్యేకంగా ఉండేలా ఈ హీరో ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా శ్రీనువైట్ల చెప్పిన కథ నచ్చడంతో ఆయన ఫ్లాప్స్ లో ఉన్నారని కూడా పట్టించుకోకుండా ఛాన్స్ ఇచ్చ్దాడు.

ఈ సినిమాకు ‘మిస్టర్’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. అయితే శ్రీనువైట్ల ఈ సినిమాలో వరుణ్ ని ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడట. శ్రీనువైట్ల గతంలో ‘ఆగడు’ సినిమాలో మహేష్, బాద్షా సినిమాలో ఎన్‌టి‌ఆర్ ని, బ్రూస్ లీ సినిమాలో రామ్ ని పోలీస్ ఆఫీసర్ పాత్రల్లోనే చూపించాడు. అయితే ఆ మూడు చిత్రాలు శ్రీనువైట్లకు పెద్దగా కలిసిరాలేదు. బాద్షా మాత్రం ఓ మోస్తారు హిట్ ను అందుకొంది. మళ్ళీ అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ.. వరుణ్ ని కూడా పోలీస్ గా చూపించబోతున్న వైట్లకు ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందో.. చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus