శ్రీనువైట్లకి తప్పని మిస్టర్ కష్టాలు!

  • October 3, 2017 / 07:01 AM IST

ఒక్క సినిమాతో సూపర్ స్టార్లు అయిపోయినవారేలా అయితే ఉన్నారో.. అదే ఒక్క సినిమాతో పాతాళం లోతుకి పాటుకుపోయినవాళ్లు కూడా ఉన్నారు. అలా పాతాళానికి అతి చేరువలో ఉన్న దర్శకుడే శ్రీనువైట్ల. ఏ ముహూర్తాన “మిస్టర్” సినిమాకి శ్రీకారం చుట్టాడో ఏమో కానీ.. సినిమా రిజల్ట్ మొదలుకొని శాటిలైట్ రైట్స్, హీరో ఇమేజ్ ఇలా అన్నీ దారుణంగా డ్యామేజ్ అయ్యాయి. సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది చాలా సాధారణంగా జరిగే విషయం కానీ.. వైట్ల “మిస్టర్”తో అందుకొన్న ఫ్లాప్ మాత్రం “అంతకు మించి” వంటిది. అయితే.. సినిమా రిలీజయ్యాక సమసిపోవాల్సిన ఈ సినిమా కష్టాలు.. ఇప్పటికీ శ్రీనువైట్లను వెంటాడుతూనే ఉన్నాయి.

“మిస్టర్” డిజాస్టర్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిత్ర నిర్మాతలైన ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలకు తాను తీసుకొన్న రెమ్యూనరేషన్ లో సగ భాగం వెనక్కి ఇవ్వడమో లేక ఒక సినిమా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేసివ్వడమో చేసిపెడతానన్న శ్రీనువైట్ల గత కొంతకాలంగా ఎవరికీ రెస్పాండ్ అవ్వకుండా కనీసం కాల్స్ ఆన్సర్ చేయకుండా సైలెంట్ గా ఉంటున్నాడట. దీంతో ఓపిక కోల్పోయిన నిర్మాతలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను సంప్రదించారు. ఇప్పటికీ రెస్పాండ్ అవ్వకపోతే శ్రీనువైట్లపై లీగల్ కేస్ కూడా వేసేందుకు వారు సిద్ధమవుతున్నారట. మరి శ్రీనువైట్ల ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి తనపై పడబోయే లీగల్ కేసుల నుండి తప్పించుకొంటాడో లేక ఇలాగే యారోగెంట్ గా బిహేవ్ చేస్తూ కోర్టు చుట్టూ తిరుగుతాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus