నిర్మాతకు నో చెప్పినందుకే నాపై దుష్ప్రచారం

సినిమా రంగం మొదలైన కొత్తల్లో హీరోయిన్ మీడియా ముందుకు వచ్చేది కాదు. వచ్చినా కేవలం సినిమా సంగతులు మాత్రమే చెప్పాల్సి ఉండేది. ఒక్క విషయంలో నోరు జారిన కెరీర్ పై తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకే పెద్దగా ఎవరూ పరిశ్రమలోని సంగతులను బయటపెట్టేవారు కాదు. కానీ నేటి తరం హీరోయిన్స్ తమ అనుభవాలను మీడియా ముందు వివరిస్తున్నారు. మంచి అయినా, చెడు అయినా దైర్యంగా చెబుతున్నారు. ఈ మధ్య నిర్మాతలు, అవకాశాలు ఇప్పించేవారు తమని లైంగికంగా వేధించేవారని కొంతమంది హీరోయిన్స్ చెబుతున్నారు. సదరు నిర్మాత పేరు చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా అతనెవరో యువ కథానాయికలకు, ఔత్సాహిక నటీమణులకు తెలిసేలా చేస్తున్నారు. క‌న్న‌డ న‌టి శృతి హరిహ‌ర‌ణ్ తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి బ‌య‌ట‌ పెట్టారు.

“నేను న‌టించిన ఓ క‌న్న‌డ సినిమా హ‌క్కుల‌ను ఓ ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత కొన్నారు. త‌మిళ సినిమాలోనూ న‌న్నే హీరోయిన్‌గా తీసుకుంటామన్నారు. అయితే ఆయ‌న ఓ ష‌ర‌తు పెట్టారు. ఈ సినిమాకు మొత్తం ఐదుగురు నిర్మాతలం. మాకు అవ‌స‌ర‌మైన‌పుడు నిన్ను మా మ‌ధ్య ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. ఓకేనా` అని అడిగారు. వెంట‌నే నా కాలి చెప్పు తీసి ఆ నిర్మాత‌కు చూపించా. అప్ప‌ట్నుంచి త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నాపై దుష్ర్ప‌చారం మొద‌లైంది. అందుకే నాకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయ‌” అని శృతి చెప్పుకుంది. తాము అవకాశాలకోసం నీచమైన పనులు చేస్తామనే ఆలోచనను ఇప్పటికైనా నిర్మాతలు మార్చుకోవాలని సూచించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus