నూరు సినిమాలకు సంగీతం సమకూర్చిన ఎస్ ఎస్ థమన్

  • November 1, 2018 / 12:40 PM IST

సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాల్లో గట్టి పోటీ ఉంది. ఛాన్స్ అందుకోవడం.. విజయం సాధించడం.. పేరు ని నిలబెట్టుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు. అలా గట్టి పోటీ ఉన్న సమయంలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ మ్యూజిక్ డైరక్టర్ స్థాయికి చేరుకున్నారు. జాతీయస్థాయిలో పేరున్న సంగీతదర్శకులు మ్యూజిక్ ఇస్తున్న సైరా నరసింహారెడ్డి, సాహో ప్రచార వీడియోలకు నేపథ్య సంగీతం అందించడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే. ఇటువంటి ఘనత సాధించిన థమన్ తాజాగా మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. వంద సినిమాల మైలురాయిని చేరుకొని.. అతి తక్కువ కాలంలో ఈ రికార్డ్ నెలకొల్పిన సంగీత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు.

బీభత్సం అనే సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన థమన్ .. రీసెంట్ గా వచ్చిన అరవిందసమేతతో వంద చిత్రాలను (అన్ని భాషల్లో కలుపుకొని) పూర్తి చేసుకున్నారు. వంద చిత్రాలను పూర్తి చేసుకోవడం ఒక ఆనందం అయితే ఆ చిత్రం 150 కోట్ల పైన గ్రాస్ వసూలు చేయడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని థమన్ వెల్లడించారు. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికపై చెప్పారు. దీంతో సినీ ప్రముఖులు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus