“సాహో”లో సోలో విలన్ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు..!

  • September 1, 2017 / 02:08 PM IST

“బాహుబలి” కథానాయకుడిగా వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకొన్న ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకొంటారు చెప్పండి. కానీ.. ఒక నటుడు మాత్రం తనకు అందివచ్చిన అద్భుతావకాశాన్ని చాలా ఈజీగా వదిలేశాడు. పైగా.. తనకు ప్రభాస్ తో కలిసి నటించడం కంటే.. కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించడం ఇష్టం అంటూ ఓ చిన్న స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. అతడెవరో కాదు.. రామ్ చరణ్ “ధృవ”తో విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన నిన్నటితరం కథానాయకుడు అరవిందస్వామి.

నిజానికి బాలీవుడ్ యాక్టర్ “నీల్ నితిన్ ముఖేష్” కంటే ముందు “సాహో” బృందం అరవిందస్వామిని అప్రోచ్ అయ్యిందట. స్టైలిష్ విలన్ రోల్ కావడంతోపాటు నటనకు విశేషమైన ఆస్కారం ఉండడంతో.. అరవిందస్వామి అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తాడనుకొన్నారు. కానీ.. క్యారెక్టరైజేషన్ నచ్చకపోవడం, షూటింగ్ కోసం డేట్స్ కూడా ఎక్కువగా అడగడంతో అరవిందస్వామి సింపుల్ గా నో చెప్పేశాడు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus