ప్రెగ్నెన్సీ వార్తల పై స్పందించిన నటి..!

ప్రేమ, పెళ్లి అనేవి ప్రతీ ఒక్కరి జీవితాల్లో చాలా ముఖ్యమైన ఘట్టాలు.వీటి విషయంలో ఎవ్వరూ కూడా అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ అలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే.. వాళ్ళు వార్తలకెక్కుతారు. సరిగ్గా ఓ నటి ఇలాగే వార్తల్లో నిలిచింది.ఇటీవల ఆ నటి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి చేసుకుంది అబ్బాయిని కాదు. అలా అని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఈమె లెస్బియన్ కూడా కాదు. తనకు తానే ప్రేమలో పడిందట. అందుకే తనకు తానే పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించింది.

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె షేర్ చేయగా.. అవి ఏదో గొప్ప పనికి సంబంధించినవన్నట్టు వైరల్ అయిపోయాయి. ఆ నటి మరెవరో కాదు బుల్లితెర బ్యూటీ కనిష్క సోని. సోలోగమి అన్నట్టు ఈమె తనని తానే పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా ఈమె ప్రెగ్నెంట్ అయినట్టు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి.అందుకు కారణం ఈమె కాస్త బొద్దుగా తయారవ్వడం. పెళ్లికి వ్యతిరేకి అయినంత మాత్రాన శృంగారానికి వ్యతిరేకి కాదేమో.. అది ఇష్టమైన వాడితో చేసి గర్భం దల్చిందేమో అంటూ జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

దీంతో వీటికి వెంటనే రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ.’ నన్ను నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను ఎలా ప్రెగ్నెంట్ అవ్వగలను. అది సాధ్యం కాదు. మీరంతా అనుకుంటుంది అస్సలు కాదు. పిజ్జాలు, బర్గర్లు ఎక్కువ తిని లావయ్యాను అంతే ‘ అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus