స్టార్ డైరక్టర్లు అల్లు అర్జున్ ని ఎందుకు దూరం పెడుతున్నారు?

  • January 17, 2018 / 08:50 AM IST

కోడి ముందా? గుడ్డు ముందా? అనే సమాధానం చిక్కని ప్రశ్న మాదిరిగా టాలీవుడ్ లో మరో ప్రశ్న చక్కర్లు కొడుతోంది. టాప్ డైరెక్టర్లను అల్లు అర్జున్ దూరం పెడుతున్నారా? స్టార్ డైరక్టర్లే బన్నీని పక్కన పెడుతున్నారా? అనే ప్రసన్నకు సమాధానం దొరకడం కష్టంగా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ రైటర్ వక్కంతం వంశీ ని డైరక్టర్ గా పరిచయం చేస్తూ.. నా పేరు సూర్య సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మరో యువదర్శకునితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. సీనియర్స్ హిట్స్ ఇవ్వడం లేదని కొత్తవారిని బన్నీ ప్రోత్సహిస్తున్నట్లు అతని సన్నిహితులు కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నారు. అయితే అందులో వాస్తవం లేదని స్టార్ డైరక్టర్లే బన్నీని పక్కన పెడుతున్నారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

బాహుబలి 2 తరువాత రాజమౌళి తీయబోయే భారీప్రాజెక్ట్ లో స్థానం సంపాదించుకోవాలని అల్లుఅర్జున్ చాలా ప్రయత్నం చేసారంట. కానీ జక్కన్న బన్నీని పట్టించుకోలేదు. చరణ్, తారక్ ని ఎంచుకున్నారు. తర్వాత బన్నీ దృష్టి కొరటాల శివ పై పడింది. కొరటాల కూడ బన్నీతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు. సరే త్రివిక్రమ్ తో చేద్దామని అనుకుంటే అతను కూడా నో చెప్పినట్లు తెలిసింది. ఎందుకని బన్నీని దూరం పెడుతున్నారని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. సరైనోడు, దువ్వాడ జగన్నాథం సమయంలో అల్లు అర్జున్ డైరెక్టర్లకు తెగ సూచనలు చెప్పారంటా. ఆ విషయం చిత్ర పరిశ్రమకి మొత్తం తెలిసిపోయిందని.. అందుకే అతనంటే స్టార్ డైరక్టర్లు దూరం జరుగుతున్నారని టాక్. మరి దీనిపై బన్నీ ఏమంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus