ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ కూతురు!

  • August 24, 2019 / 01:56 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్ ఒకరు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈయనకు ఓ ముద్దుల కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు ఇరా ఖాన్. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. టాటూలతో, హాట్ హాట్ ఫొటోలతో ఈమె బోల్డ్ నెస్ తో చాలా మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఇక ఈమె చాలా కాలంగా సంగీతకారుడు మిశాల్ కిర్పలానితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్నీ గతంలో కన్ఫార్మ్ చేసింది.

ఇన్స్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే సెషన్ లో ‘ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా..?’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. దానికి ఇరాఖాన్ తడుముకోకుండా ఓ ఫోటో ను షేర్ చేసి మరీ ఆన్సర్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు మరోసారి ఇరాఖాన్ తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో మిశాల్ ఇరాను వెనకనుండి కౌగిలించుకున్నాడు మిశాల్. ఇరా నవ్వుతూ ఆ కౌగిలిని ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫోటోకు ‘ఎవిరిథింగ్ విల్ బీ ఓకే’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus