హీరోయిన్ని భయపెట్టి మరీ వశపరుచుకున్న స్టార్ హీరో

ఆయనొక స్టార్ హీరో, అందులోనూ ఓ భారీ కుటుంబం నుంచి కథానాయకుడు. అతడిని కాదనే ధైర్యం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరికీ లేదు. పైకి సైలెంట్ గా కనిపిస్తాడు కానీ చాలా వయోలెంట్ క్యాండిడేట్ మనోడు. మొన్నటివరకూ అంతా బాగానే సాగింది కానీ.. ఈమధ్యకాలంలో ఒక హీరోయిన్ మనోడ్ని దూరం పెట్టడం మొదలెట్టింది. ఇప్పటివరకూ తాను కోరిన ప్రతి హీరోయిన్ ను తన వద్దకు వచ్చేలా చేసుకున్న ఆ హీరోకి ఈ కొత్త హీరోయిన్ దూరం పెట్టడం అనేది అవమానంగా భావించాడు. అంతే.. డైరెక్ట్ గా ఏమీ అనకుండా, ఇండైరెక్ట్ గా ఎటాక్ మొదలెట్టాడు. సినిమా పబ్లిసిటీ విషయంలో ఎక్కడా ఆమె పేరు కనిపించకుండా తన పి.ఆర్ టీం సహాయంతో ఆమెను ఇబ్బందిపెట్టడం మొదలెట్టాడు.

భారీ చిత్రమే కాక.. తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ సినిమా విషయంలో తన పేరు వినబడకపోవడంతో తొలుత కన్ఫ్యూజ్ అయిన ఆ అందాల భామ చివరికి విషయం తెలిసి.. ఏమీ చేయలేక హీరోకి సరెండర్ అయిపోయింది. అప్పటికి హీరోగారి కోపం తగ్గి అమ్మడికి కూడా పబ్లిసిటీలో సమానమైన ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాడట. పాపం ఈ రచ్చ కారణంగా బిక్కచచ్చిపోయిన ఆ హీరోయిన్ ఏం చేయాలో తెలియక ఇటీవల ఒక ప్రయివేట్ పార్టీలో తన స్నేహితుల దగ్గర భోరుమందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus