కరోనా విజృంభణ తగ్గుముఖం పడుతుంది.. అని ఊపిరి పీల్చుకునే లోపు.. ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కరోనా భారిన పడటం అందరినీ ఆందోళన కలిగిస్తుంది. మొన్నటికి మొన్న రాజమౌళి, అమితాబ్, తమన్నా, జీవిత రాజశేఖర్ లు..వంటి సెలబ్రిటీలు కరోనా భారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ మధ్య ఆయన స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే… డాక్టర్లు కరోనా పరీక్షలు చేసి ఆయనకు పాజిటివ్ అని నిర్దారించారట.
దీంతో పృథ్వీరాజ్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. పృథ్వీరాజ్ ప్రస్తుతం ‘జన గణ మన’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మధ్యనే షూటింగ్లకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ చిత్రం షూటింగ్ ను కేరళలోని ఎర్నాకులంలో ప్రారంభించారు.ఈ షూటింగ్లో పాల్గొనడం వల్లే పృథ్వికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. తనతో పాటు దర్శకుడు డిజో జోస్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందట.
దాంతో ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ ను ఆపేసారు. ఈ ఏడాది ‘అయ్యప్పన్ కోషియమ్’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పృథ్వీ. ఆ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!