షూటింగ్ లు ఆపేయడం వల్ల.. మాకు అలాంటి నష్టం అయితే రాదు..!

ఆగస్టు 1 నుండీ టాలీవుడ్లో షూటింగ్ లు ఆపేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. తమకు చాలా సమస్యలు ఉన్నాయి అని, ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతల పై అలుగుతూ ఉంటారు. మరి మా సమస్యలు కూడా అందరికీ అర్ధం కావాలి కదా… అదే మా ఉద్దేశం అంటూ గిల్డ్ సభ్యులు చెబుతున్నారు. అయితే షూటింగ్ లు ఆపడం వల్ల నిర్మాతలకే నష్టం. కానీ నిర్మాతలు షూటింగ్ లు ఆపడానికి డిసైడ్ అయ్యారు. అది వారి తెలివి తక్కువ నిర్ణయమే అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇందుకు వారు చెప్పే సమాధానాలు వేరుగా ఉన్నాయి.

ఓ బడా నిర్మాతని షూటింగ్ లు ఆపడం వల్ల మీకే నష్టం కదా అని అడిగితే .. అతను చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురిచేసింది. అతను మాట్లాడుతూ.. షూటింగ్ లు ఆపేస్తే మాకు నష్టం ఉంది. అది వాస్తవమే. కానీ మేము షూటింగ్ లు ఆపేస్తున్నాం అని ముందే తెలిసినప్పుడు క్యాస్ట్ అండ్ క్రూ ని పిలవం. స్టూడియో లకి రెంట్ లు ఇచ్చి స్లాట్ బుక్ చేసుకోము. కానీ ఓ పెద్ద స్టార్ హీరో షూటింగ్ కు వస్తాను అని చెప్పి లాస్ట్ మినట్ లో రాను అని చెబుతాడు.

అప్పుడు మాకు భారీ నష్టం వస్తుంది. నటీనటుల కాల్ షీట్ లకు పేమెంట్ చేయాలి, యూనిట్ సభ్యులు , జూనియర్ ఆర్టిస్ట్ లు వీళ్ళందరికీ పేమెంట్ చేయాల్సిందే.ఒక్క రోజులో కోటి రూపాయలు నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలాంటి వేస్ట్ ఖర్చులతో పోలిస్తే .. షూటింగ్ ముందుగా ఆపేస్తున్నప్పుడు మాకు అంత నష్టం రాడు. ఆ స్టార్ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన్ని ఒక్క మాట అంటే ఆయన అభిమానులు విరుచుకుపడతారు.

అతని సినిమాకి నష్టాలు వస్తే తిరిగి ఇచ్చేస్తాడు అంటారు.అతనికి కావాల్సిన బయ్యర్స్ కి మాత్రం నిర్మాతలకు చెప్పి డబ్బులు తిరిగి ఇవ్వండి అంటాడు. అలాంటివి మాకు నష్టాలు కాదా” అంటూ ఆ బడా నిర్మాత ప్రశ్నిస్తున్నాడు. హీరోల పారితోషికాలు తగ్గిస్తే , కార్మికులు డిమాండ్ మేరకు వేతనాలు పెంచడానికి నిర్మాతలు ఇలా షూటింగ్ లు ఆపేసి బంద్ చేస్తున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.