పొలిటీషియన్ సపోర్ట్ తో హోటల్లో రెచ్చిపోయిన హీరోయిన్

  • May 12, 2018 / 10:57 AM IST

హీరోయిన్స్ అన్నాక రకరకాల పరిచయాలుంటాయి. కొందరికి సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకులతో పరిచయాలుంటే.. కొందరు తమ స్టార్ పవర్ ను గ్లామర్ ను యూజ్ చేసుకొని బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ తోను బంధాలు, సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సదరు ‘సం’బంధాలను వారెలా వినియోగిస్తారనే విషయం వారి పర్సనల్ యాటిట్యూడ్ ను బట్టి ఉంటుంది. అయితే.. మొన్న రాత్రి ఓ పాపులర్ కథానాయకి తాను బస చేస్తున్న హోటల్ లో రచ్చ రచ్చ చేసిందట. ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ కాకపోయినప్పటికీ.. కేవలం ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ అండ తనకు ఉందన్న ఏకైక నమ్మకంతో నానా యాగీ చేసిందట సదరు కథానాయకి.

ఒక హీరో ఇచ్చిన ప్రయివేట్ పార్టీకి అటెండ్ అయ్యి హోటల్ కి రిటర్న్ అయిన ఆ హీరోయిన్ హోటల్ సిబ్బందిని మళ్ళీ వోడ్కా అడిగిందట. బార్ క్లోజ్ అయిపోయిందని హోటల్ సిబ్బంది చెప్పినా వినకుండా.. తనకు తెలిసిన పొలిటీషియన్ కు ఫోన్ చేసి, అతని చేత ఆ హోటల్ మేనేజర్ కి ఫోన్ చేయించి మరీ ఆ రాంగ్ టైమ్ లో తనకు కావాల్సిన మందు తెప్పించుకుందట. ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది. ఎవరా హీరోయిన్, ఆమెకు ఆ టైమ్ లో అంతలా సపోర్ట్ చేసిన పొలిటీషియన్ ఎవరా అని అందరూ ఆరాలు తీయడం మొదలెట్టారు. ఇలాంటి విషయాల్లో పేర్లు అంత త్వరగా బయటకి రావు కాబట్టి, ఎవరి ఊహలు వారివి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus