హీరోయిన్ అంజలి గురించి సంచలన కామెంట్లు చేసిన నిర్మాత..!

  • November 25, 2019 / 05:37 PM IST

‘ఫోటో’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ‘షాపింగ్ మాల్’ చిత్రంతోనే పాపులర్ అయ్యింది హీరోయిన్ అంజలి. ఆ తరువాత వచ్చిన ‘జర్నీ’ చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో ఈమె టాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్ అయిపొయింది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తోన్న అంజలి.. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇక అంజలి ‘జర్నీ’ సినిమా టైంలోనే హీరో జై తో ప్రేమాయణం నడిపింది వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్ని వారు కొట్టిపారేశారు. దీంతో ఇది రూమరే అని అంతా పక్కన పెట్టేసారు. అయితే ‘జర్నీ’ తరువాత వీరిద్దరూ `బెలూన్‌` అనే సినిమాలో కూడా కలిసి న‌టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రం నిర్మాత నంద‌కుమార్ హీరో జై, హీరోయిన్ అంజ‌లి రిలేష‌న్ షిప్‌ పై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఆయన మాట్లాడుతూ.. “అంజ‌లి చాలా మంచి అమ్మాయి, కానీ ఆమె జీవితంలోకి హీరో జై వ‌చ్చిన త‌ర్వాత ట్రాక్ తప్పింది. కొడైకెనాల్‌ షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు హీరో, హీరోయిన్ల‌కు వేర్వేరు రూమ్స్ బుక్స్ చేశాం. కానీ జై, అంజలి మాత్రం ఓకే రూమ్‌లో ఉండేవారు. సరే మరో రూమ్ క్యాన్సిల్ చేద్దామంటే జై ఒప్పుకునేవాడు కాడు. దాంతో ఆ రూమ్‌కి కూడా రోజుకు 12000 రూపాయ‌లు చొప్పున అద్దె చెల్లించాము. షూటింగ్‌లో అంజ‌లిని పేరు పెట్టి పిలిస్తే జై గొడ‌వ‌ప‌డేవాడు.. ‘ ‘మేడ‌మ్’ అనే పిల‌వాల‌ని.. లేకుంటే షూటింగ్ ఆపేస్తాన‌ని బెదిరించేవాడు. ఒక‌రోజు అంజ‌లి షూటింగ్‌కి రాలేదు. మేం ఆమెకు చాలా సార్లు ఫోన్ చేసినా తీయ‌లేదు. చివ‌ర‌కు ఆమె ఫోన్ చేసి క‌డుపు నొప్పిగా ఉంద‌ని చెప్పింది. మేం ఆమె రూముకు కారుని కూడా పంపాం. కానీ జై, అంజ‌లి అదే కారులోనే ఎయిర్‌పోర్టుకు వెళ్ళి.. అక్క‌డ నుండి చెన్నై వెళ్ళిపోయారు. మా షూటింగ్ ఆగిపోయింది. జై ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా నేను చాలా న‌ష్ట‌పోయాను” అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus