సినిమాల్లో హీరోలను విలన్లు తమ మాట వినకపోయినా లేక తాము చెప్పింది చేయకపోయినా “చంపేస్తాం, నాశనం చేసేస్తాం” అని బెదిరిస్తుంటారు. అవన్నీ రీల్ లైఫ్ వరకే పరిమితం అనుకొంటాం కానీ.. నిజజీవితంలోనూ అలాంటివి జరుగుతాయ్. రీసెంట్ గా రామ్ కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. బెదిరించింది మరెవరో కాదు రామ్ తో ఓ సూపర్ హిట్ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఓ బడా ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు బెల్లంకొండ సురేష్ బాబు.
రామ్ కథానాయకుడిగా “కందిరీగ” సినిమా నిర్మించిన అనంతరం “రభస” కూడా రామ్ హీరోగా చేసేందుకు ప్లాన్ చేసుకోవడంతోపాటు కోటిన్నర అడ్వాన్స్ కూడా ఇచ్చాడంట. అయితే కథ రామ్ కు నచ్చకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసి వేరే సినిమా చేసుకొన్నాడు. ఆ తర్వాత “రభస” ఎన్టీయార్ చేయడం, సినిమా ఫ్లాప్ అవ్వడం, బెల్లంకొండకు భారీ నష్టాలు రావడం అనేది టకటకా జరిగిపోయాయి.
కట్ చేస్తే.. రామ్ ఇన్నాళ్ల తర్వాత కూడా అప్పుడు తీసుకొన్న కోటిన్నర రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వకపోవడంతో చాన్నాళ్లపాటు అడిగి అడిగి విసిగివేసారిపోయిన బెల్లంకొండ సురేష్ మామూలుగా అడిగితే పని అవ్వదని గ్రహించి.. రామ్ లేటెస్ట్ మూవీ “ఉన్నది ఒకటే జిందగీ” రిలీజ్ కి రెడీగా ఉండడంతో.. “నా అడ్వాన్స్ నాకు తిరిగి ఇవ్వకపోతే.. నీ సినిమా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేస్తా” అని రామ్ ని బెదిరించాడట. మొదట్లో ఆ బెదిరింపులను పట్టించుకోని రామ్.. బెల్లంకొండ సురేష్ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ను వాట్సాప్ లో పంపించేసరికి షాక్ అయ్యి.. షేక్ కూడా అయ్యి వెంటనే రాజీకోచ్చాడట. తాను మాత్రమే కాక కొందరు ఇండస్ట్రీ పెద్దలను కూడా కూర్చోబెట్టి ఇష్యూ సెటిల్ చేసుకొన్నాడట రామ్.