ప్రతి సినిమాలో హీరోయిన్ పేరు ‘ప్రియా’ అని పెట్టడానికి కారణం అదే

  • September 13, 2019 / 06:40 PM IST

తన మేజికల్ డైరెక్షన్ తో ప్రేక్షకుల్ని సీట్లకి కట్టి పడేస్తుంటాడు దర్శకుడు విక్రమ్.కె.కుమార్. ‘ఇష్టం’ ’13 బి’ ‘ఇష్క్’ ‘మనం’ ’24’ ‘హలో’ ఇలా ప్రతీ సినిమాలోను హీరోయిన్ పేరు ప్రియా. అంతేకాదు తాజా వచ్చిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ లో హీరోయిన్ పేరు ప్రియా. అసలు విక్రమ్ కుమార్ ఇలా ప్రతీ సినిమాలోనూ హీరోయిన్ పేరు ప్రియా అనే ఎందుకు పెడుతున్నాడు అనే సందేహం అందరిలోనూ ఉంది. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్ల టైంలో కూడా నాని ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. ‘ఆ పేరు వెనుక సీక్రెట్ ఏంటో’ విక్రమ్ కుమార్ ను అడగమని గుర్తుచేశాడు.

ఇక ఈ ‘ప్రియా’ పేరు వెనుక అసలు కారణం ఏంటనేది చెప్పుకొచ్చాడు విక్రమ్ కుమార్. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ… “ఫస్ట్ నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే.. కామన్ గా ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ కి ప్రియా అనే నేమ్ సెట్ చేస్తాను. అయితే ఆ పేరు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. అది మాత్రం చాలా పర్సనల్..! ‘ప్రియా’ అనే నేమ్ చాలా స్వీట్ గా ఉంటుంది… అదే ప్రధానం కారణం” అంటూ చెప్పుకొచ్చాడు విక్రమ్ కుమార్. ‘ప్రియా’ పేరు పెట్టడానికి క్లారిటీ అయితే ఇచ్చాడు కానీ అసలు సీక్రెట్ మాత్రం ఆయన బయటపెట్టలేదు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus