Nelson Dilipkumar: సినిమా ఫుటేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ పోయిందట.. ఏమైందంటే?

ప్రస్తుతం కోలీవుడ్‌ సినిమాలో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఓ మాస్టర్‌ మైండ్‌. రజనీకాంత్‌ విజయం దొరికితే చాలు అనుకున్న సమయంలో ‘జైలర్‌’ అనే సినిమా తీసి.. ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చారు. ఆ తర్వాత ‘జైలర్‌ 2’ ని మరోసారి వచ్చి ఆ కాంబో పవర్‌ ఏంటో చూపించారు. తలైవాను ఎలా చూపించాలి, ఎలా చూపిస్తే ప్రేక్షకుల మెప్పు పొందొచ్చు అనే కిటుకు ఆయన దగ్గర ఉంది. అలాంటి నెల్సన్‌ కథ ఒకటి పోయింది. దీని గురించి నెల్సన్‌ సన్నిహితుడు, మరో దర్శకుడు రాజ్‌ కుమార్‌ పెరియస్వామి తెలిపారు.

Nelson Dilipkumar

నయనతారతో ‘కోలమావు కోకిల’ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు నెల్సన్‌. ఆ తర్వాత శివకార్తికేయన్‌తో చేసిన ‘డాక్టర్’ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయ్‌తో చేసిన ‘బీస్ట్’ థియేటర్లలో ఇబ్బందికర ఫలితం అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలో, టీవీలో తెగ చూశారు అనుకోండి. ఆ వెంటనే చేసిన రెండు ‘జైలర్‌’లు భారీ విజయాన్నే అందించాయి. దాంతో ఐదు సినిమాల్లో నాలుగు భారీ విజయాలతో నెల్సన్ తనేంటో చాటి చెప్పారు.

నెల్సన్ ఫస్ట్ సినిమా ‘కోలమావు కోకిల’ 2018లో వచ్చింది. అక్కడికి 9 ఏళ్ల ముందే తన తొలి చిత్రాన్ని మొదలుపెట్టారట నెల్సన్‌. ఆ సినిమాలో పేరున్న నటులే నటించారు కూడా. ఐతే కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. ఎంతకీ ఆ సినిమా పూర్తి కాలేదు. ఆ సినిమాకు టీజర్ కూడా కట్ చేశారట. సినిమా చివరి దశలో ఉండగా రషెస్‌ అంతా ఒక ల్యాప్‌టాప్‌లో పెట్టారట నెల్సన్. అయితే దాన్ని ఎవరో కొట్టేశారట. అలా ఆ సినిమా అంతా పోయిందట.

అలా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకే రాలేదని రాజ్‌కుమార్ చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత నెల్సన్ మళ్లీ ప్రయత్నాలు చేసి, ‘కోలమావు కోకిల’ చేశారని తెలిపారు. అయితే ఆ రషెస్‌ ఇంకెక్కడా సేవ్‌ చేసుకోలేదా? అనే ప్రశ్న మాత్రం అలానే ఉండిపోయింది.

నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus