చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ఖరారు!

  • February 2, 2017 / 12:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ సమయం ఆసన్నమయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిరు, పవన్ కాంబో మూవీ నిర్మిస్తున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త, సినీ బంధు టి.సుబ్బిరామి రెడ్డి ఈరోజు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ లో ఆనందం వెళ్లి విరిసింది. చిరంజీవి ప్రస్తుతం 151 సినిమా కోసం శ్రమిస్తున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మూవీ మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా ఇద్దరి డేట్స్ ఈ ఏడాది మొత్తం లాక్ అయింది. సో వచ్చే ఏడాది మెగా కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడు ఈ మూవీ తెరకెక్కినప్పటికీ రికార్డులు తిరగరాయడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus